Saturday, April 20, 2024

గెజిట్‌ అమలుపై సస్పెన్స్‌!

  • రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ మినిట్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్ర జలశక్తి జారీచేసిన గెజిట్‌ ప్రకారం గురువారం నుండి గెజిట్‌ అమలుకా వాల్సి ఉండగా, ఇంకా రాష్ట్రాలు ఔట్‌లెట్ల అప్పగింత కు సంబంధించి బుధవారం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలతో సహా అన్ని ఔట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకుంటామని బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ ప్రకటించగా, గురువారం నుండి ప్రాజెక్టులను స్వాధీనంలోకి తీసుకునే పరిస్థితులు కనబడడం లేదు. శ్రీశైలంలో ఏడు, సాగర్‌లో తిమ్మిది వెరసి 16 ఔట్‌లెట్ల ను బోర్డు పరిధిలోకి తీసుకుంటూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా బోర్డులో సభ్యులైన రెండు రాష్ట్రాల అధికారు లు ఆమోదించారు. ఈ మేరకు ప్రాజెక్టులను బోర్డుకు స్వాధీనం చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని బోర్డు చైర్మన్‌ సూచించగా తక్షణమే జారీ చేస్తామని ఏపీ అధికారులు తెలిపారు. ఔట్‌లెట్లను బోర్డుకు స్వాధీనం చేయడంపై ప్రభుత్వంతో చర్చించి చెబుతామని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. అయితే అటు ఏపీ అధికారులు కూ డా బుధవారం ఎలాంటి ఉత్త ర్వులు జారీ చేయ కపోగా, తెలం గాణ అధికారులు దీనిపై స్పందించలేదు. కేఆర్‌ఎంబీ అధికారులు మాత్రం రెండు రాష్ట్రాలకు సమావేశంలో నిర్ణయించిన అంశాలపై మినిట్స్‌ జారీచేశామని, అప్పగింతపై వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కోరినట్లు తెలిసింది.


ఏపీ విద్యుత్‌ కేంద్రాల మెలిక
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 16 ఔట్‌లెట్లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నా మని, తక్షణమే ఔట్‌లెట్ల అప్పగింతపై ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొన్న ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ కేంద్రాలను కూడా స్వాధీనం చేసుకోవాలని మెలిక పెడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సర్కార్‌ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం, నాగా ర్జునసాగర్‌ విద్యుత్‌ కేంద్రాలను బోర్డుకు స్వాధీనం చేస్తేనే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రాలను బోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేస్తాం. తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు స్వాధీనం చేసుకుంటేనే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం. లేదంటే గెజిట్‌కు అర్థం లేదని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ మాత్రం విద్యుత్‌ కేంద్రాల అప్పగింతకు ససేమిరా అంటోంది.

తెలంగాణ ఏం చేయబోతోంది?
తెలంగాణకు సంబంధించి శ్రీశైలం ఎడగమట్టు విద్యుత్‌ కేంద్రం, నాగార్జునసాగర్‌ స్పిల్‌వే, కుడికాలువ ప్రధాన రెగ్యులేటర్‌, ఎడమకాలువ ప్రధాన రెగ్యులేటర్‌, ఎడమకాలువ విద్యుత్‌ కేంద్రం, ప్రధాన విద్యుత్‌ కేంద్రం, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, హైదరాబాద్‌ తాగునీటి పథకం, నాగార్జునసాగర్‌ వరదకాలువలు అప్పగించాలని కేఆర్‌ఎంబీ పేర్కొంటోంది. ఏపీకి సంబంధించి ఆరు ఔట్‌లెట్లు శ్రీశైలం స్పిల్‌వే, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, హంద్రీనీవా పంప్‌హౌస్‌, ముచ్చుమర్రి ఎత్తిపోతల పంప్‌హౌస్‌, నాగార్జునసాగర్‌ కుడికాలువ విద్యుత్‌ కేంద్రంలు అప్పగింతకు రెడీగా ఉన్నట్లు ఏపీ చెబుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెజిట్‌ వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా, అంగీకరించలేదు. కేఆర్‌ఎంబీ సమావేశంలో తెలంగాణ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ ఇదే అంశాన్ని ప్రస్తావించగా, కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ ఆపే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారు.. మళ్ళీ కేంద్రం కోర్టులోకి బంతి వెళుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement