Friday, April 19, 2024

జ‌న‌సేన‌లో చేరిన టిడిపి,వైసిపి కార్య‌క‌ర్త‌లు..

మచిలీపట్నం నియోజకవర్గం అరిసేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చిట్టి పాలెంలో వైఎస్ఆర్ సిపి , తెలుగుదేశం పార్టీకి చెందిన 25 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రామకృష్ణ, అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ ఆధ్వర్యంలో చిట్టిపాలెం మెయిన్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించారు. జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజకీయాల్లో మార్పు కొరకు జనసేన పార్టీలో చేరుతున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. కరోనా సమయంలోనూ, గ్రామంలో జరిగిన మూడు పెద్ద సేవ కార్యక్రమాలలో జనసేన పార్టీ పాల్గొని తమ గ్రామస్తులకు సహాయ సహకారాలు అందించడం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వారు తెలియజేశారు. ఇంచార్జ్ బండి రామకృష్ణ మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని, ఇటీవల జరిగిన ఎన్నికలలో గ్రామాలలోనూ పట్టణంలోనూ జనసేనకి ఓట్లు శాతం పెరిగిందని, ప్రజలలో మార్పు మొదలైంది అన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి జనసేన పార్టీ ముందు ఉంటుందని అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ అన్నారు. రెండు ప్రభుత్వాలు 60 సంవత్సరాలు మచిలీపట్నంని పరిపాలించిన మచిలీపట్నం అభివృద్ధి “ఎక్కడ వేసిన గొంగలి అక్కడే” ఉన్న స్థాయిలో ఉందని అన్నారు. నిజాయితీగల నాయకులుని పాలకులను ఎన్నుకోవడంలో అరిసేపల్లి, చిట్టి పాలెంగ్రామ పంచాయతీలు ముందు ఉంటాయని అన్నారు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ఎస్సీ సెల్ నాయకులు వంపుగడవల చౌదరి అన్నారు. జనసేన నాయకుడు పేర్ని రవి మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాలుకి జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు.వీరమహిళ కుమారి మాట్లాడుతూ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు పాలకులు కి కనిపించడం లేదన్నారు. చిట్టి పాలెం చెందిన చంద్రిక ప్రేమ్ కుమార్, డి.అగర్కార్, చండిక రాము,చోడబోసు భాస్కర్ రావు, చండిక నాగ హరి కిషోర్, అంగడి మోహన్ రావు మరో 20 మంది జనసేన సభ్యత్వం తీసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కోవిడ్ నిబంధనలతో కార్యక్రమం నిర్వహించారు. తీన్మార్ డప్పులు తో పూల వర్షంతో చిట్టిపాలెంలో జనసైనికులు పవన్ కళ్యాణ్ పాటలు,డైలాగ్స్ తో సందడి చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement