Saturday, April 20, 2024

ఏపీ డీజీపీ నకిలీ ఖాతా సమాచారం ఇచ్చేందుకు ట్విట్టర్ నిరాకరణ

ఏపీ డీజీపీ పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన వారి వివరాలు ఇచ్చేందుకు ట్విట్టర్ నిరాకరించింది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఇవ్వలేమని ట్విట్టర్ సమాధానం ఇచ్చింది. ఈ విషయంపై ట్విట్టర్‌కు మూడుసార్లు మెయిల్స్ పంపినా స్పందించలేదు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫోటోతో కేటుగాళ్లు మూడు నకిలీ ఖాతాలు సృష్టించడంతో ఈ అంశంపై అధికారులు ట్విట్టర్‌కు మెయిల్ పంపడంతో మూడు ఖాతాలను ట్విట్టర్ తొలగించింది.

అయితే ట్విట్టర్ ఖాతా సృష్టించినవారి ఐపీ అడ్రస్, ఇతర వివారాలు ఇచ్చేందుకు ట్విట్టర్ నిరాకరించింది. తమకు ఖాతాదారుల వ్యక్తిగత భద్రతే ముఖ్యమని స్పష్టం చేసింది. దర్యాప్తుకు సహకరించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా ట్విట్టర్ స్పందించలేదు. దీంతో కేంద్రం ఇటీవల తెచ్చిన ఐటీ చట్టాలను ఏపీ పోలీసులు పరిశీలిస్తున్నారు. విజయవాడ పోలీసుల విజ్ఞప్తిని ట్విట్టర్ పట్టించుకోకపోవడంతో నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement