Saturday, November 9, 2024

కృష్ణమ్మ ఒడి నుంచి బయట‌పడుతున్న సంగమేశ్వరుడు..

కృష్ణమ్మ ఒడి నుంచి సంగమేశ్వరుడు బయటపడుతున్నాడు. త్వరలోనే భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. శ్రీశైల జలాశయం నీటి మట్టం క్రమేణా తగ్గుతూ ఆదివారం 840 అడుగులకు చేరడంతో సంగమేశ్వర ఆలయం ప్రహరి వరకు ఆలయం బయటపడింది. గతేడాది జూలై 20వ తేదీన కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు చేరుకున్నాడు.

ఆరు నెలల అనంతరం ఈ నెల చివరి నాటికి సంగమేశ్వరుడు దర్శన భాగ్యం భక్తులకు లభించనుందని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. ఇదిలా ఉండగా సప్తనదుల సంగమేశ్వర ఆలయం జలాధి వాసం వీడడంతో భక్తుల తాకిడి పెరగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement