Sunday, May 16, 2021

ఎస్బీఐ ఎటిఎంలో న‌గ‌దుకు చెద‌లు…

మైలవరం, – గ్రామాల్లో పూరిళ్లకు,కలపకు,పుస్తకాలకు చెదలు పట్టి పాడుచేయడం చూశాం .కానీ డబ్బులు డ్రా చేసే ఏటీఎం’కు చెదలు పట్టడం మైలవరం’లొనే చూస్తున్నాం.దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వస్తే “మైలవరం’స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్’లో ఖాతాదారుల సౌకర్యార్థం ఏటీఎం’ను ఏర్పాటు చేసి సేవాలందిస్తున్న‌ది .ఇదిలావుంటే గురువారం ఉదయం “చాట్ల సుధాకర్’ అనే ఖాతాదారుడు ఏటీఎం’లో రూ.10 వేల నగదును డ్రా చేయగా మొత్తం చెదలు పట్టిన నోట్లే వచ్చాయి.అతని ముందు తరువాత మరి కొంతమంది ఖాతాదారులు నగదు డ్రా చేసినా చెదలు పట్టిన నోట్లే వచ్చాయి.ఈ విషయమై ఖాతాదారులు బ్యాంకు మేనేజర్’ను నిలదీయగా చెదలు పట్టిన నోట్లను మార్చి చలామణి’లో ఉన్న నోట్లను మార్చి ఇచ్చారు. అంత వరకు కథ సుఖాంతమైనా మరి చెదలు పట్టిన నోట్లు ఏటీఎం’లోకి ఎలా వచ్చాయనేదే ప్రశ్న?ప్రతిరోజు బ్యాంకు “ఏటీఎం’లో నగదు అమర్చే క్యాషియర్’కు చదలు కనిపించలేదా?అసలు ఏటీఎంలో ఏం జరుగుతుంది . ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ ‘మీడియా వివరణ కోరగా అందుకు ఆయన నిరాకరించారు. దీంతో కొంద‌రు ఖాతాదారులు స్థానిక ఎస్సై రాంబాబు దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో బ్బందితో ‘బ్యాంకుకు వెళ్లి ఏటీఎంలో చెద‌లు పట్టిన నోట్లు రావడంపై విచారించారు.మరోసారి ఇలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని,ఖాతాదారుల సమస్యలు,ఫిర్యాదులపై స్పందించాలని మేనేజర్’ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News