Thursday, April 25, 2024

షార్ట్ సర్క్యూట్ తో స్కూల్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో శనివారం ఉదయం రేపల్లెకు చెందిన శ్రీ చైతన్య స్కూల్ బస్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 7గంటలకు ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఉదయం డ్రైవర్ బస్సు స్టార్ట్ చేసే సమయానికి ఒక్కసారిగా మంటలు రావడంతో డ్రైవర్ బస్సులోంచి దిగి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఆ సమయంలో స్కూల్ బస్సులో విద్యార్థులు ఎవరు కూడా లేరు. హుటాహుటిన అవనిగడ్డ అగ్నిమాప‌క సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. అప్పటికే బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. సంఘటన ప్రాంతాన్ని స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement