Friday, April 26, 2024

కొవిడ్ రోగుల‌కు చికిత్స‌ను వైద్య సిబ్బంది అంకిత భావంతో చేయాలి – మంత్రి పేర్ని నాని

మ‌చిలీప‌ట్నం – ఆసుపత్రుల్లో కరోనా రోగులకు వైద్యం చేసే విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని సమావేశపు హాలులో ఆయన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బందితో కోవిడ్ పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండవ దశలో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఎక్కువ అవడం వల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా బాధితుల తాకిడి ఎక్కువైందని, ఇది దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రిలో బెడ్ల ను 250 నుండి 300లకు పైగా ఉన్నప్పటికీ ఆసుపత్రి బయట ట్రీట్మెంట్ కోసం పడిగాపులు కాసేవారు రోజురోజుకి ఎక్కువ అవుతున్నారన్నారు. ట్రీట్ మెంట్తో పాటు ఆక్సిజన్ అవసరం ఉన్నవారికే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచం ఇవ్వాలని, ఆక్సిజన్ అవసరం లేనివారికి, హోం ఐసోలేషన్లో ఉండటానికి అవకాశం. లేనివారికి ప్రక్కనే త్వరలో ఏర్పాటు చేయనున్న కోవిడ్ కేర్ సెంటర్ లుగా పురుషులకు నోబుల్ కళాశాల, స్త్రీలకు లేడీయాంపిల్ జూనియర్ కళాశాలలకు రిఫర్ చేయాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు. రెమెడిసివర్ ఇంజక్షన్ అవసరం అనుకున్న ప్రతి రోగికి ఇవ్వాలని అలాగే ఆసుపత్రిలోని బెడ్డు, ఆక్సిజన్, మెడిసిన్ గురించి నిత్యం సంబంధిత డాక్టర్లు ఆడిట్ చేయాలని సూచించారు. వైద్యం అత్యవసరం అనుకున్న రోగికే రికమెండేషన్ స్వీకరించాలని, తీవ్రతరం కాని కేసులు రికమెండేషన్లు పరిగణించనవసరం లేదని ఆయన వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని డాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే ఫోన్ ద్వారా సంబంధిత అధికారిని సంప్రదించి ఆసుపత్రికి 7 కెఎల్ ఆక్సిజన్ వచ్చేలా చర్య తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా బాధితులకు మీరు దేవుడి రూపంలో ఉన్న వైద్యులు అని, నూరుశాతం అంకిత భావంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ ఎన్ఎస్ కె. ఖాజావలి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.మాధవీ, డిసిహెచ్ఎస్ డా. జ్యోతిర్మయి, ఆర్ఎఎంఓ మల్లిఖార్జునరావు, అల్లాడ శ్రీనివాసరావు, జగదీష్ ఇతర డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement