Thursday, April 25, 2024

లక్ష్మీపురం సర్పంచ్ కోటేశ్వరరావుకు స‌త్కారం..

చల్లపల్లి- కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా కమిటీ కార్యదర్శి చింతపల్లి దాస్ సోమవారం ఉదయం చల్లపల్లి మండలం లక్ష్మిపురంలో వైసీపీ తరపున గెలుపొందిన సర్పంచ్ కొల్లూరి కోటేశ్వరరావును ఘనంగా సన్మానం చేశారు. గ్రామ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి లక్ష్మిపురం గ్రామ సర్పంచ్ గా రెండవ సారి విజయం సాధించటం పట్ల అభినందనలు తెలిపారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుమ్మడి జాన్ బాబు, బూరేపల్లి భిక్షాలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement