Wednesday, April 24, 2024

కృష్ణాజలాల సరఫరాకు రూ 40 కోట్లు విడుదల చేయాలి

ఎ. కొండూరు – మండలంలోని గిరిజన తండాలకు కృష్ణాజలాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ 40 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ గిరిజన సంఘం నాయకులు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ రామక్రిష్ణా రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడలోని గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్సీ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బి. గోపి రాజు, గొల్లమందల తండా సర్పంచ్ ధారావతు రాముడు మాట్లాడుతూ రెడ్డి గూడెం మండలం కుదప గ్రామం నుండి, ఎ. కొండూరు మండలం లోని గిరిజన తండాలకు కృష్ణాజలాలు సరఫరా చేయటానికి ప్రభుత్వం రూ 40 కోట్ల రూపాయల అంచనాలు తయారు చేసి, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండి మంజూరు చేయాలని కోరారు. ఆర్ డబ్ల్యుఎస్ శాఖ లో గిరిజన ఉద్యోగులు గత 10 సంవత్సరాల నుండి పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్ బి. చక్రి నాయక్, జిల్లా కార్యదర్శి, బి. నాగరాజు, డాక్టర్ జ్యోతి లాల్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు బి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement