Saturday, October 5, 2024

AP: అమ్మ సన్నిధిలో సర్వ దోష నివారణ శాంతి హోమం…

ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో..
(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సర్వ దోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు.

ఆలయంలో సర్వదోష నివారణార్థం, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు అన్ని ప్రముఖ దేవాలయాల్లో శాంతి హోమములు నిర్వహించుటలో భాగంగా గురువారం దేవస్థానంలోని చండీ యాగశాలలో ఆలయ ఈవో కె ఎస్ రామరావు సమక్షంలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులచే శాంతి హోమం శాస్త్రోక్తముగా నిర్వహించారు.

- Advertisement -

కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో కేఎస్ రామారావు మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం దేవస్థానంలో శుద్ధి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇటీవలే దేవస్థానంలో పవిత్రోత్సవములు నిర్వహించడం జరిగినదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు సర్వ పదార్థముల దోషముల‌న్నీనివారణ అయ్యి, శాంతి పొందుటకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సత్ సంకల్పంతో పవిత్ర ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్నయమ్మ, జగన్మాత సన్నిధిలో శాంతి హోమం నిర్వహించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement