Saturday, April 20, 2024

అవనిగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ గా హనుమంతరావు.. బాధ్యతల స్వీకరణ..

కృష్ణాజిల్లా : అవనిగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ గా కొక్కిలిగడ్డ హనుమంతరావు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన కోటేశ్వర నాయక్ వినుకొండ డిపోకి బదిలీ కాగా, అక్కడ డిపో మేనేజర్ గా పనిచేసిన హనుమంతరావు అవనిగడ్డకు బదిలీపై వచ్చారు. గతంలో హనుమంతరావు అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్ ఇన్సెక్టరుగా చాలా కాలం పని చేశారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నేతలు, సిబ్బంది హనుమంతరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement