Thursday, April 25, 2024

ఇంద్ర‌కీలాద్రిపై ఆది దంపతుల కల్యాణం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసివున్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఆది దంపతుల దివ్యలీలా కల్యాణోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. ఈ సందర్భంగా గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు.. రాయభార మండపంలో కవిపం డితులతో ఎదురుకోల ఉత్సవం వైభవంగా నిర్వ హించారు. అనంతరం రుత్విక్కులు ఆది దంప తులకు కల్యాణోత్సవం జరిపారు. బ్రహ్మోత్స వాలను పురస్కరించుకుని ఆలయ స్థానాచా ర్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద ఆధ్వర్యంలో ఆలయ అర్చక సిబ్బంది ఉదయం సదస్యము వేదస్వస్తి నిర్వహించారు. ముందుగా ఆలయ స్థానాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ గంగా దుర్గామల్లె శ్వర స్వామి వార్ల ఊరేగింపు వైభవంగా నిర్వ హించారు. చివరగా వేదపండితులు వేదాశీ ర్వచనం అందజేశారు. ఈ కార్యక్ర మంలో ఈఓ డి.భ్రమరాంబ పాల్గొన్నారు. భక్తులను అనుమ తించలేదు.
ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు మరింత తీవ్రం
ఇంద్రకీలాద్రిపై కోవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శన వేళలను అధికారులు కుదించారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు దుర్గమ్మ దర్శనం లభించనుంది. అమ్మవారికి నిర్వహించే అన్ని సేవలతో పాటు- పంచహారతులను ఏకాంతంగా నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఆలయ సిబ్బంది సైతం పరిమిత సంఖ్యలోనే వస్తున్నారు. ఆంక్షల నేపథ్యంలో భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి కళ్యాణోత్సవం జరిగినా భక్తులు కేవలం వెయ్యి నుంచి 1200 వరకే పరిమితం అయ్యారు.
మూడుకు చేరిన మృతుల సంఖ్య
కరోనాతో తాజాగా ఆల యంలో పనిచేస్తున్న జమలమ్మ అనే అ-టె-ండర్‌ మృతి చెందింది. జమలమ్మ మృతితో ఇంద్రకీలాద్రి పై మృతుల సంఖ్య మూడుకు చేరింది. సోమవారం ఇద్దరు అర్చకులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కోవిడ్‌ బాధితుల సంఖ్య 35కు చేరుకుంది. గతవారం ఆలయ అర్చకుడు, పరిచారకుడు మృతి చెందగా.. మరొక అర్చకుని పరిస్ధితి విషమంగా మారింది. కోవిడ్‌ కేసుల తీవ్రతతో ఉద్యోగులు, అర్చకుల్లో మరింత భయాందోళనలు పెరుగుతున్నాయి. ఆలయంలో విధులు నిర్వహించాలంటేనే అర్చకులు, ఉద్యోగులు వణికిపోతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement