Friday, April 26, 2024

సిపిఐ మాజీ ఎమ్మెల్యే కె సుబ్బ‌రాజు క‌న్నుమూత‌

హైదరాబాద్‌ : సీపీఐ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు (66) కన్నుమూశారు. గత అర్ధరాత్రి తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. అమెరికా నుంచి కుమారుడు, కుమార్తె వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సీపీఐ అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించిన సుబ్బరాజు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గానూ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement