Saturday, April 17, 2021

భార్య స‌జీవ‌ద‌హ‌నం కేసులో భ‌ర్త‌కు ఉరిశిక్ష‌..

విజయవాడ: భార్య హత్య కేసులో భర్తకు ఉరిశిక్ష విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివ‌రాల‌లోకి వెళితే, కృష్ణలంకలో 2019లో గర్భవతి అయిన భార్యపై భ‌ర్త బ‌త్తుల నంబియార్ సుజీత్ పెట్రోల్‌ పోసి స‌జీవ‌ద‌హ‌నం చేశారు.. ఈ హ‌త్య 2019, జూన్ 15న ఫకీర్‌గూడెంలో జరిగింది. ఈ కేసును విచారించిన కోర్టు ఈ హ‌త్య‌ను సీరియస్‌గా పరిగణించిన కోర్టు.. భర్త సుజిత్‌కు ఉరిశిక్షను విధించింది. ఈ తీర్పు పట్ల బాధితురాలి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News