Thursday, April 18, 2024

పెన‌మ‌లూరులో మైనర్ బాలిక ఆత్మహత్య

కృష్ణా : చిన్న వయసులో పెళ్లి వద్దు అన్నందుకు మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు మండ‌లంలో చోటుచేసుకుంది. మండలంలోని కానూరు గ్రామంలో సనత్ నగర్ కి చెందిన బాలిక ఒక ఫ్రూట్ జ్యూస్ షాపులో పని చేస్తూ ఇంటర్ చదివే యువకుడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులతో అతన్నే వివాహం చేసుకుంటాను అని చెప్పడంతో తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. కొంతకాలం నిరీక్షించాలని పెళ్లి వయస్సు వచ్చాక అప్పుడు చూద్దాం అనడంతో మ‌న‌స్థాపానికి గురైనా బాలిక‌.. ఆదివారం రాత్రి ఇంట్లో అందరు ఉండగానే గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు చేసుకుంది. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పెన‌మ‌లూరు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement