Tuesday, March 26, 2024

ఏపీకి 470మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయింపు : కృష్ణబాబు

విజయవాడ: ఏపీకి 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేంద్రం కేటాయించినట్లు కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో 20 వేల మందికి ఆక్సిజన్ అందిస్తున్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తోందన్నారు. దేశంలో ఇతర ప్రాంతాలు నుంచి 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తోందని తెలిపారు. దేశంలో సుదూర ప్రాంతాలు నుంచి మరో 220 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానున్నట్లు వెల్లడించారు. ఒరిస్సాలోని టాటా స్టీల్ ప్లాంట్, ఏఎస్‌డబ్ల్యూ నుంచి అంకురు ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్‌లో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఏపీ కేటాయించారన్నారు. విజయవాడ నుంచి ఒరిస్సా వెళ్లాలంటే 4 రోజులు పడుతుంది కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం కేటాయించారని తెలిపారు. రెండు ట్యాంకర్‌లు ఒకటి 18 మెట్రిక్ టన్నులు, మరొకటి 28 టన్నుల ట్యాంకర్ కెపాసిటీ పంపించామని…వచ్చిన ఆక్సిజన్ సక్రమంగా వినియోగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో విమానం బయలుదేరి వెళ్తోందని చెప్పారు. గ్రీన్ ఛానెల్ ద్వారా ఆక్సిజన్ వాహనాలు వచ్చేందుకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement