Sunday, April 11, 2021

జనసేనన అభ్యర్థులను గెలిపించండి

గంపలగూడెం – సమాజంలో మార్పు కోసం స్థాపించిన జనసేన పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని మండల జనసేన అధ్యక్షుడు,చింతలపాటి వెంకటకృష్ణారావు కోరారు ఆయన మండలంలోని చింతలనర్వ జనసేన అభ్యర్థిని చింతలపాటి శ్రీదేవి మరియు జడ్పీటీసీ అభ్యర్థి పట్ర రవి కు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేపట్టి ఓటర్లకు బ్యాలెట్ పేపర్ పై అవగాహన కల్పించి ఈ నెల 8వ తేదీన జరగనున్న ఎన్నికలలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి బీజేపీ,జనసేన అభ్యర్థులను గెలిపించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు గాడేవారిగూడెం సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావు, నాగేశ్వరరావు,వెంకటకృష్ణ,నాగబాబు, శ్రీను,కృష్ణారావు, లక్ష్మీనారాయణ,నరసింహారావు, హనుమంతరావు,రాము,జగ్గయ్య, కృష్ణ పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Prabha News