Thursday, April 18, 2024

పక్షి ప్రేమికులకు ఆలవాలంగా.. కొండకర్ల ఆవను పర్యాటక కేంద్రగా అభివృద్ధి

అమరావతి, ఆంధ్రప్రభ : అనకాపల్లి జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొండకర్ల ఆవ మంచినీటి చిత్తడి నేలను మొదటి కన్జర్వేషన్‌ రిజర్వ్‌ మరియు ప్రముఖ పర్యాటక కేంద్రంగా పునరాభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది జరిగితే, రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద చిత్తడి నేల పక్షులు, పక్షి ప్రేమికులు మరియు శీతాకాలంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయ అందాలను ఆస్వాదించడానికి ఇష్టపడే పర్యాటకులకు ఇది స్వర్గధామం కానున్నది. ఈమేరకు విశాఖపట్నం అటవీ అధికారి అనంత్‌ శంకర్‌ కొండకర్ల ఆవను కన్జర్వేషన్‌ రిజర్వ్‌గా ప్రకటించేందుకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కలిసి దీని ప్రయోజనాలను వివరించనున్నారు. తదనంతరం ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు అభివృద్ధికి పచ్చజెండా ఊపనున్నారు. ఈఅందమైన ప్రదేశాన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమ పర్యాటక-స్నేహపూర్వక పరిరక్షణ రిజర్వ్‌గా అభివృద్ధి చేయడానికి ఈ ప్రతిపాదనను పంపనున్నారు. రిమోట్‌ సెన్సింగ్‌ మరియు జీఐఎస్‌ వంటి సాంకేతికతను ఉపయోగించి సరస్సు యొక్క భౌతిక, జీవ మరియు రసాయన పారామితులను పర్యవేక్షించనున్నారు. పర్యటాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించి, ఇక్కడి అనుభూతులను ఆస్వాదించేందుకు గానూ వారిపేర్లను నమోదు చేసుకోవడానికి వీలుగా కొండకర్ల అవ మిత్ర (కేఏఎం) అనే మొబైల్‌ యాప్‌ను రూపొందింస్తున్నారు.

చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ, అభివృద్ధి కోసం అనకాపల్లి కలెక్టర్‌ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీ-ని ఏర్పాటు- చేశారు. ఈ కమిటీలో వ్యవసాయం, ఉద్యానవనం, అటవీ, నీటిపారుదల, విద్య, పర్యాటకం మరియు మత్స్య శాఖలకు చెందిన ఇతరులను కూడా నియమించారు. కార్పొరేట్‌ సంస్థల ప్రమేయంతో సీఎస్‌ఆర్‌ నిధులను వినియోగించి అనేక కార్యక్రమాలు చేపడతామని ఇటీ-వల జరిగిన ఈకమిటీ సమావేశంలో అనకాపల్లి కలెక్టర్‌ రవి పట్టంశెట్టి చెప్పారు. తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ నిపుణుడు రాజా బండి మాట్లాడుతూ, సమర్థవంతమైన పరిరక్షణ ప్రయోజనాల కోసం చిత్తడి నేలల దీర్ఘకాలిక డేటాను సేకరించాలని సూచించారు. దీనిపై స్థానిక యువతకు అవగాహన కల్పించడానికి మార్గదర్శకుడిగా తాను వ్యవహరిస్తానని కూడా హామీ ఇచ్చారు. దీనిద్వారా వారికి స్థిరమైన జీవనోపాధిని అందించడానికి పక్షుల గైడ్‌లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. చిత్తడి నేల అంచున కొబ్బరి మరియు అటవీ చెట్ల పెంపకం, సరస్సు సరిహద్దును స్థిరీకరించడానికి, సరైన సరిహద్దును గుర్తించడానికి మరియు స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి ఈ కొండకర్ల ఆవ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement