Friday, March 29, 2024

ఓటు హక్కు లేని పిల్లలతో పవన్ సీఎం అని పిలిపించుకుంటారు‌: కొడాలి

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. ఓటు హక్కు లేని పిల్లలతో పవన్ సీఎం అని పిలిపించుకుంటార‌ని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పేమెంట్ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సొల్లు కబుర్లు చెబుతార‌ని ఆయ‌న అన్నారు. జ‌న‌సేన సైనికులు ఇప్పుడు జన సైకిల్‌గా మారారని విమర్శించారు. మంగ‌ళ‌గిరిలో నారా లోకేశ్ ఓడిపోయిన‌ప్ప‌టికీ చంద్రబాబుకు బుద్ధి రాలేదని కొడాలి నాని అన్నారు. ఎన్నిక‌ల్లో ఇక‌పై చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వస్తాయో రావోన‌ని విమ‌ర్శించారు. సీపీఎం, బీజేపీ పార్టీల‌కు నోటాకు ప‌డిన‌న్ని ఓట్లు కూడా ప‌డ‌వ‌ని చెప్పారు. సీఎం  జగన్  పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయ‌న అన్నారు. వైసీపీ బ‌లంగా ఉన్న నేప‌థ్యంలోనే టీడీపీ అధినేత‌ చంద్రబాబు ప‌రిష‌త్ ఎన్నిక‌ల విష‌యంలో నాట‌కాలు ఆడుతున్నార‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement