Sunday, March 24, 2024

కండలేరు, పోలవరం.. ప్రాజెక్టుల భూసేకరణలో గోల్‌మాల్‌!

భూ సేకరణ సొమ్ములను కొట్టేసేందుకు భూ మాఫియా కొత్త దారులను ఎంచుకుం టోంది. ప్రభుత్వం రైతులకిచ్చే పరిహారాన్ని కాజేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అడ్డదారులను తొక్కుతున్నారు. ఫలితంగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములను త్యాగాలు చేస్తున్న రైతులకు అన్యాయం జరుగుతోంది.

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రాజెక్టుల భూసేకరణ పనుల్లో కూడా తీవ్ర జాప్యం నెలకొంటోంది. దీంతో ప్రభుత్వ లక్ష్యాలు నీరుగారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌ పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. అందుకోసం అవసరమైన భూమిని రైతుల నుండి సేకరించి ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే, మరోవైపు భూ మాఫియా అంతే వేగంగా భూ రికార్డులను తారుమారు చేస్తూ నకిలీ పట్టాలను సృష్టించి రైతు నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేసు న్నారు. అనేక సందర్భాల్లో ఇటువంటి సంఘ టనలు బయటకు రావడం, రైతులు ఆందోళన చేయడం తదితర కారణాలు వెరసి భూసేకరణపై విచారణకు ఆదేశిస్తున్నారు. దీంతో ఆయా ప్రాజెక్టు భూ సేకరణ పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. భూ మాఫియా సృష్టించే నకిలీ పట్టాలను గుర్తించలేక ఆయా ప్రాంతాలకు చెందిన రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుం టున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల పరిధిలో ఇదే తరహా ఉదంతాలు చోటు చేసుకుం టున్నాయి. ఉదాహరణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో మెట్ట భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు సోమశిల నుండి సుమారు రూ. 2 వేల కోట్లతో హైలెవల్‌ కెనాల్‌ (ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల) నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం రెండు నియోజకవర్గాల పరిధిలో సుమారు 3,126 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకుంది. హైలెవల్‌ కెనాల్‌ నిర్మాణానికి సంబంధించి భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 7 లక్షల నుండి రూ. 10 లక్షల వరకూ పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సరిగ్గా ఇక్కడి నుండే భూ మాఫియా కన్ను మర్రిపాడు, దుత్తలూరు, వింజమూరు మండలాల పరిధిలోని రైతుల భూములపై పడింది. రాత్రికి రాత్రే మర్రిపాడు మండల పరిధిలోని సుమారు 1,500 ఎకరాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను మాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

పరిహార సొమ్ముకోసం .. అడ్డదారులు
నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండల పరిధి లో సోమశిల హై లెవెల్‌ కెనాల్‌తో పాటు బ్యాలె న్సింగ్‌ రిజర్వాయర్‌ను కూడా నిర్మిస్తున్నారు. అందుకు సంబంధించి పీఎన్‌ పల్లి, చుంచులూరు, కదిరినాయుడు పల్లి, ఇసుకపల్లి, ఎర్రబాడు, కంప సముద్రం, చాగోలు, బ్రాహ్మ ణపల్లి తదితర గ్రామాల పరిధిలో రైతుల నుండి సుమారు 1,580 ఎకరాలను సేకరించారు. విష యం తెలుసుకున్న భూ మాఫియా పై గ్రామాల రైతులకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను మాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన స్థానిక రెవెన్యూ అధి కారులు జిల్లా కలెక్టరేట్‌లో రికార్డులను పరిశీ లించాలని ప్రయత్నించినప్పటికీ అక్కడ కూడా పై గ్రామాలకు సంబంధించిన కొన్ని రికార్డుల ఆచూకీ లభించలేదని తెలిసింది. పథకం ప్రకా రం భూ మాఫియా స్థానిక రెవెన్యూ అధి కారులతో కలిసి రైతుల భూములకు సంబం ధించిన రికార్డులను మాయంచేసి నకిలీ పేర్లతో బోగస్‌ పట్టాలను సృష్టించి ప్రభుత్వం ఇచ్చే భూ పరిహారాన్ని బొక్కేసేందుకు పథకం వేసినట్లు స్పష్టంగా అర్ధమౌతోంది. ఇదే విషయంపై జిల్లా ఉన్నత స్థాయి అధికారులు రెండు, మూడు సందర్భాల్లో సమీక్ష చేసినా రైతులకు సంబం ధించి అసలైన రికార్డులు, అర్హులైన పట్టాదారుల వివరాలపై స్పష్టత రాలేదు. దీంతో భూ సేకరణ పూర్తయినప్పటికీ పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం చోటుచేసు కుంది. ఫలితంగా మొదటి దశ పనులు అసంపూర్తిగానే మిగలిపోవల్సా వచ్చిం ది. రెండో దశ పనులకు కూడా ఇదే తరహా ఆటంకాలు ఎదురవు తున్నాయి.

కండలేరు, పోలవరం భూ సేకరణలోనూ.. ఇదే తీరు
సోమశిల హైలెవల్‌ భూ సేకరణతోపాటు కండలేరు ముంపు గ్రామాలకు సంబంధించి ఒకటి రెండు గ్రామాలు అలాగే పోలవరం భూ సేకరణలో కూడా భూ మాఫియాదే పైచేయిలా కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం పిలుపుతో ప్రాజెక్టుల నిర్మాణానికి తమ వంతు సహకారాన్ని అందిస్తూ విలువైన భూములను త్యాగం చేసేందుకు ముందుకొస్తున్న రైతులకు సకాలంలో పరిహారం మాత్రం అందడంలేదు. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. ప్రభుత్వం ఎక్కడైతే ప్రాజెక్టులు నిర్మించబోతోందో ఆయా ప్రాంతాలను గుర్తించి భూ మాఫియా ముందే బోగస్‌ పేర్లతో నకిలీ పట్టాలను సృష్టిస్తోంది. భూ సేకరణ పూర్తిచేసిన అధికారులు పరిహారం చెల్లింపు సమయం వచ్చేసరికి ఒకే సర్వే నెంబరులోని ఒకే భూమికి సంబంధించి ఇద్దరు ముగ్గురు రైతులు తమకు పరిహారం చెల్లించాలంటే..కాదు..తమకే చెల్లించాలంటూ పట్టుబడుతూ ఆ భూములకు సంబంధించిన పట్టానలు అధికారులకు చూపుతున్నారు. వాటిలో అసలేదో.. నకిలీదేదో.. అధికారులు గుర్తించేందుకు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన రికార్డులు కనిపించడం లేదు. దీంతో ఆ సమస్యను ఎలా పరిష్క రించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

సీఎం జోక్యం అనివార్యమే
రాష్ట్ర ప్రభు త్వానికి తలవంపులు తెచ్చే విధంగా జరుగు తున్న ఈ తంతుపై స్వయంగా ముఖ్య మంత్రి తలదూర్చకపోతే తీవ్ర అన్యాయం జరుగుతుం దని స్థానికులు వాపోతున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా అడగకుండానే అన్ని ఇచ్చిన సీఎం జగన్‌ సాగు నీటి ప్రాజె క్టుల అంశంలో భూ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట వేసి నిజమైన లబ్దిదారులకు న్యా యం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement