Tuesday, October 1, 2024

Kakinada – తోట భూములు సర్కారు స్వాధీనం – ఎమ్మెల్సీ త్రిమూర్తులకు భారీ షాక్​

ఆంధ్రప్రభ స్మార్ట్, కాకినాడ : వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న ప్రభుత్వ భూములు నేడు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాజులూరు మండలం పల్లిపాలెం లో 35 ఎకరాల భూములు తోట కుటుంబం అధీనంలో ఉన్నాయి.ఇవి ప్రభుత్వ భూములని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఏడెకరాల భూములకు సంబంధించి ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉంది .మిగిలిన 28 ఎకరాల భూములపై ఎలాంటి కేసులు లేవు. అవి ల్యాండ్ సీలింగ్ భూములుగా ఎప్పటినుంచో అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

కానీ వైసిపి ప్రభుత్వ హయాంలో ఆ భూముల జోలికి అధికారులు వెళ్ళలేదు. కాగా శనివారం జిల్లా కలెక్టర్ షామ్ మోహన్ సగిలి, ఆర్డిఓ ఇట్ల కిషోర్, రెవిన్యూ అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య ఆ భూముల వద్దకు వెళ్లారు. 28 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. ఒకేసారి 28 ఎకరాల భూములు స్వాధీనం చేసుకోవడం జిల్లాలో ఇదే మొదటిసారిగా రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. వైసీపీ హయంలో భూములు అన్యాక్రాంతమైనా పట్టించుకోలేదు. ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం ఇలాంటి అవినీతి ఆక్రమాలు వెలుగులోకి తీస్తోందంటూ నాయకులు వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement