Wednesday, April 3, 2024

రాజీనామా చేసే ప్రసక్తే లేదు: కాకినాడ మేయర్

కాకినాడ మేయర్ పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై మేయర్ సుంకర పావని స్పందించారు. మహిళ అని చూడకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి ఎదురుగా సిసి కెమెరాలు ఎర్పాటు చేయడం విచారకరమన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మేయర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని పావని స్పష్టం చేశారు. తనకు కార్పొరేటర్లు మద్దతు లేకపోయినా ప్రజల మద్దతు ఉందన్నారు.

కాగా,  కాకినాడ మేయర్‌పై అక్టోబర్‌ 5న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల కలెక్టర్‌ను కలిసిన 33 మంది కార్పొరేటర్లు.. నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేయర్‌ పావనికి కలెక్టర్‌ హరికిరణ్‌ నోటీసులు పంపించారు. నోటీసు తీసుకునేందుకు ఇంట్లో నుంచి మేయర్‌ పావని బయటకు రాకపోవడంతో మేయర్‌ ఇంటి గోడకు అధికారులు నోటీసును అతికించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్ ఛార్జీలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement