Saturday, April 20, 2024

కొవిడ్ టీకాతో బలమైన రక్షణ….

బ్రహ్మంగారిమఠం : ప్రభుత్వం ప్రకటించిన 18 సంవత్సరాలు పైబడిన వయస్సు వారు కరోనా టీకా వేయించుకుంటే
వారికి టీకా బలమైన రక్షణ ఇస్తుందని వైద్యాధికారులు భరోసా ఇస్తున్నారు. తొలిడోసు టీకా పొందిన తర్వాత యాంటీబాడీలు వృద్ధిచెందుతాయి. ఐతే రెండవ డోసు తీసుకున్న 14 రోజులకు తర్వాత పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది. కొందరిలో టీకా పొందిన తర్వాత కూడా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కానీ ప్రాణాంతక పరిస్థితులు రానేరావు. రెండు డోసుల తర్వాత వైరస్ సోకిన వారిలో 90% మందిలో అసలు ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా సొల్పంగా ఉంటున్నాయి. ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందే అవకాశాలు బహు సొల్పం. తద్వారా ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశాలు ఒక శాతమే ఇప్పటి వరకు రెండు డోసుల టీకాలు పొందినవారిలో కోవిడ్ కారణంగా మృతిచెందిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. వ్యాక్సిన్ టీకా ఇంత బలమైన రక్షణ ఇస్తుందనే విషయాన్నీ ప్రజలు గుర్తించాలి. ఐతే ఒక్కమాట గుర్తుంచుకోవాలి. వైరస్ సోకినప్పుడు టీకా పొందినవారికి హాని కలిగించక పోయినా.. వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. అందుకే వ్యాక్సిన్ టీకా పొందిన వారితో పాటు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ, లేదా శానిటైజర్ లాంటివి ఉపయోగించడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement