Sunday, October 6, 2024

Tragedy – దేవ‌ర షోలో అపశృతి … ఎన్టీఆర్ అభిమాని మృతి

కడప, సెప్టెంబర్ 27 (ప్రభ న్యూస్): జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదల సందర్భంగా కడపలో విషాద ఘటన చోటుచేసుకుంది. కడప నగరంలోని అప్సర థియేటర్ లో అభిమానుల కోసం శుక్రవారం ఫ్యాన్స్ షో ప్రదర్శించారు. సినిమా చూస్తున్న క్రమంలో కేకలు వేస్తూ ఓ అభిమాని ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యుల ధ్రువీకరించారు. మృతుడు చింతకొమ్మదిన్నె మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలి(36) గా గుర్తించారు. . ఈ ఘటనపై పోలీసులు ఆరా తీసి దర్యాప్తు చేస్తున్నారు.

థియేటర్ సిబ్బందిని చితకబాదారు..

అదేవిధంగా కడపలోని రాజా థియేటర్ వద్ద కూడా జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. ‘దేవర’ రిలీజ్ షో సందర్భంగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చాలామంది అభిమానులు టికెట్ లేకుండానే థియేటర్లోకి దూసుకొచ్చారు. వారిని ఆపే క్రమంలోనే ఫ్యాన్స్, థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంతమంది అభిమానులు సిబ్బందిని చితకబాదారు. దీంతో నిర్వాహకులు షోను నిలిపేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. తర్వాత సినిమా ప్రదర్శన యధావిధిగా సాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement