Tuesday, March 28, 2023

అదుపు తప్పిన స్కూల్‌ బస్సు… విద్యార్థుల‌కు స్వ‌ల్ప గాయాలు..

విద్యార్థులు ప్ర‌యాణిస్తున్న స్కూల్ బ‌స్సు అదుపుత‌ప్పిన పంట‌పొలాల్లోకి దూసుకెళ్లిన ఘ‌ట‌న ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం తొర్రగుడిపాడులో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో చిన్నారులు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం నందిగామకు చెందిన స్కూల్ వ్యాన్ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వ్యానులో 9 మంది విద్యార్థులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement