Thursday, April 25, 2024

ఖాజీపేట పిహెచ్ సి ఆకస్మిక తనిఖీ

ఖాజీపేట, జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖధికారి డాక్టర్ రామిరెడ్డి మంగళవారం ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన పిహెచ్ సి లోనిరిజిస్టర్లు, రికార్డ్స్ చూసి పిహెచ్ సి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి, కంటి వెలుగు కార్యక్రమంలో జిల్లా లో మొదటి స్థానంలో ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమం లో వెంకటరెడ్డి, ఖాజీపేట ఆరోగ్య విస్తరణ అధికారి మాచనూరు రాఘవయ్య, షంషాద్ బేగం, సూపర్ వైజర్స్ యోగేశ్వరయ్య, కృష్ణప్రియ, ఉదయ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement