Thursday, March 28, 2024

కర్ఫ్యూ అమలును పరిశీలించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్

ప్రొద్దుటూరు, : కరోనా సెకండ్ వేవ్ అధికంగా ఉన్న తరుణంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపై తిరగవద్దని కడప ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. బుధవారం ప్రొద్దుటూరు పట్టణంలో ఆయన పర్యటించి కర్ఫ్యూ ఆంక్షలు అమలు పరిస్థితిని పరిశీలించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కర్ఫ్యూ పరిస్థితులను వీక్షించారు. అన్ని రకాల వ్యాపార దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల వరకు తెరవకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులు, ఫార్మసీలను మినహాయించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా కొనసాగాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి వెంట ప్రొద్దుటూరు డి.ఎస్.పి ప్రసాద రావు, సి.ఐలు నాగరాజు, నరసింహా రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement