Thursday, April 25, 2024

హ‌మ్మ‌య్య‌.. అన్న‌మ‌య్య‌కు ప్రాణం..

కడప ప్రభ న్యూస్‌బ్యూరో: అన్నమయ్య జిల్లా లోని రాజంపేట, పుల్లంపేట మండలాల రైతాంగా నికి సాగు నీటితో పాటు- 18 గ్రామాలకు తాగు నీటి ఆధారమైన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం పనులు చేపట్టేందుకు సంబంధించిన -టె-ండర్ల ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి కావచ్చింది. నేడో, రేపో ప్రైజ్‌ బిడ్‌ తెరిచి -టె-ండర్లను ఖరారు చేయను న్నారు. 14 నెలల క్రితం భారీ వరదలతో కొట్టు-కు పోయిన అన్నమయ్య ప్రాజెక్టు ను పునర్నిర్మి స్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అయితే, విషయంలో కదలిక ఏదీ లేకపోయింది. అసలు అన్నమయ్య ప్రాజెక్టును నిర్మిస్తారా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఇప్పుడు ఆ ప్రాజెక్టు పునర్నిర్మాణ ప్రక్రియలో ముందడుగు పడుతోంది. నిజానికి ప్రాజెక్టు పునరుద్ధరణకు గత ఏడాది నవంబర్‌ 11న రూ.787.77 కోట్లతో ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఈ ప్రతిపాదనలు జ్యుడిషీయల్‌ రివ్యూకు పంపి ఆమోదం పొందింది. అనంతరం ఈ నెల 13 నుంచి ఎస్టిమేషన్‌ కాస్ట్‌ వ్యాల్యూ రూ.635.20 కోట్లు-గా నిర్ణయించి -టె-ండర్లను ఆన్‌లైన్‌లో వుంచింది. -టె-ండర్ల గడువు ముగియడంతో ఇప్పటికే -టె-క్నికల్‌ బిడ్‌ను తెరిచిన ఇరిగేషన్‌ అధికారులు ఒకటి, రెండు రోజుల్లో ప్రైజ్‌బిడ్‌ను కూడ ఓపెన్‌ చేసి రివర్స్‌ -టె-ండరింగ్‌ ప్రక్రియను కూడ వెంటనే పూర్తి చేసి -టె-ండర్‌ను ఖరారు చేయనున్నారు.

గడువు 24 నెలలు
ఒకటి, రెండు రోజుల్లో -టె-ండర్ల ప్రక్రియ పూర్తికానున్న అన్నమయ్య ప్రాజెక్టు పునర్‌ నిర్మాణానికి కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్‌ అయిన 24 నెలల గడువులో పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. రూ.787.77 కోట్లతో ఎస్టిమేషన్‌తో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి జి.ఎస్‌.టి, ఇతరకాల పన్నులు మినహాయిస్తూ నికరంగా రూ.635.20 కోట్లతో -టె-ండర్లను పిలిచారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోనున్న కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతిపాదించిన పనులను 24 నెలల్లో పూర్తి చేయాలి.

అదే సామర్థ్యం…
అన్నమయ్య ప్రాజెక్టు పునర్‌ నిర్మాణం మునపటి సామర్థ్యంతోనే నిర్మించనున్నారు. 2.387 టి.ఎం.సిల సామర్థ్యంతో పునర్‌ నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టు రాజంపేట, పుల్లంపేట మండలాల్లోని 13 వేల ఎకరాల ఆయకట్టు-కు ఖరీఫ్‌లోనూ, 6,500 ఎకరాల ఆయకట్టు- రబీలో నీరు అందించడంతోపాటు- 18 గ్రామా లకు తాగునీరు అందివ్వనుంది. ప్రాజెక్టు తెగి పోయిన 14 నెలలకు -టె-ండర్ల దశ పూర్తి కావచ్చినా ఈ ప్రాజెక్టును నిర్ణీత 24 నెలల గడువులోగా పూర్తి చేస్తే అన్నమయ్య జిల్లాలోని ఆయకట్టు- రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement