Sunday, April 11, 2021

అఖిల్ పుట్టినరోజు – వృద్ధులకు పండ్లు పంపిణీ ….

ప్రొద్దుటూరు, – ప్రముఖ సినీ యువ నటుడు అక్కినేని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరు లోని స్థానికంగా ఉన్న మదర్ తెరిస్సా అనాథ శరణార్ధుల నివాసంలో కడపజిల్లా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నల్లం రవిశంకర్ సారధ్యంలో గురువారం వృద్ధులు కు పండ్లు పంపిణి చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ అక్కినేని అభిమాని లయన్స్ క్లబ్ డిస్టిక్ చేర్మెన్ నిచ్చెన మెట్ల సత్యనారాయణ .అభిమానులు బాషా, వెంకట సాయి, షరీఫ్, ఓబన్న, సుదర్శన్, సాధక్, సూర్య తేజ, అపోలో అశోక్, షాషా, సురేంద్ర నాథ్ రెడ్డి, రాకేష్, సుబ్రహ్మణ్యం, హరి బాబు రెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆశ్రమము లోకి కావలసిన లైట్స్ ఫాన్స్ లయన్స్ క్లబ్ తరుపున అందజేస్తామని తెలిపారు. రాబోయే కాలంలో అక్కినేని హీరోల పేరు మీద ప్రజా హిత కార్యక్రమలు నిర్వహిస్తామని రవిశంకర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News