Sunday, November 28, 2021

బద్వేల్ నియోజకవర్గానికి సీఎం జగన్ వరాలు

కడప జిల్లాలో బద్వేలులో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే వెనుకబాటులో ఉన్న నియోజకవర్గం బద్వేలు అని, గత పాలకులు ఎప్పుడూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.

కాగా బద్వేల్ నియోజకవర్గానికి సీఎం జగన్ కొన్ని వరాలను ప్రకటించారు.

★ కుందూ నదిపై లిఫ్ట్ ద్వారా బ్రహ్మంసాగర్‌కు నీళ్లు
★ కడప-పోరుమామిళ్ల మధ్య 4 లైన్ల రహదారి
★ బ్రాహ్మణపల్లి సమీపంలో రూ.9.5 కోట్లతో సగిలేరుపై మరో వంతెన
★ బద్వేలులో కూరగాయలు, చేపల మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు
★ రూ.7.5 కోట్ల వ్యయంతో గోదాముల నిర్మాణం
★ రూ.36 కోట్లతో బ్రహ్మంసాగర్ ఎడమ కాల్వలో 3 ఎత్తిపోతల నిర్మాణం
★ బద్వేలులో నూతన ఆర్డీవో కార్యాలయం

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News