Wednesday, April 24, 2024

రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌గా కె. విజయానంద్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్‌ సి.ఎస్‌.గా కె.విజయానంద్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్‌ సి.ఎస్‌. ఛాంబరులో జన్కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.శ్రీధర్‌ నుండి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్‌ సి.ఎస్‌.గా కె.విజయానంద్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే జన్కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.శ్రీధర్‌, ఏ.పి.ట్రాన్సుకో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఐ.పృధ్వీ తేజ్‌, నెడ్‌ క్యాప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమణారెడ్డి తదితరులు ఆయనకు పుష్కగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement