Thursday, December 5, 2024

జాతీయస్థాయిలో జ్యోతిష్య‌ సాగర పురస్కారం.. హైద‌రాబాద్‌లో జీవీబీ ముర‌ళ‌కృష్ణ‌కు ప్ర‌దానం

ముత్తుకూరు (ప్రభ న్యూస్): నవ్యాంధ్రప్రదేశ్ జ్యోతిష శిరోమణి, జ్యోతిష రత్న అయిన డాక్టర్ జీవీబీ మురళీకృష్ణకు జ్యోతిష శాస్త్రంలో అవార్డులు, పురస్కారాలు వస్తూనే ఉన్నాయి. జ్యోతిషంలో ఆయన క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, మానవతా దృక్పథం, సామాజిక సేవా కార్యక్రమాలను పరిగణలోకి తీసుకుంటూ ఉత్తమ ప్రశంసలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జ్యోతిష శిరోమణి డాక్టర్ జీ వీ బీ మురళీకృష్ణకు జాతీయస్థాయిలో జ్యోతిష సాగర పురస్కారం లభించింది.

పరమ పూజ్య గురూజీ ఎన్.వి రాఘవాచారి 110 జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ కేంద్రంగా జె కె ఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ జాతీయ జ్యోతిష సదస్సు నిర్వహించగా ఆహ్వానం మేరకు ఆయన హాజరయ్యారు. జ్యోతిష శాస్త్రంలో ఆయన చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ జాతీయస్థాయిలో జ్యోతిష సాగర పురస్కారం అందజేసి జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి వి.రామ సుబ్రమణియన్ హాజర‌య్యారు. ఈ అవార్డును ఆయన సమక్షంలో జే కే ఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ వి ఆర్ ఏ రాజా అందజేసినారు. ఈ సన్మానంపై జాతీయ జ్యోతిష సాగర పురస్కారం గ్రహీత సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు దేశ విదేశాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement