Sunday, June 13, 2021

నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వర్తిస్తున్న జూడాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇవాళ చర్చలకు పిలిచింది. ప్రభుత్వంతో చర్చలు విఫలమైతే సమ్మె దిశగా వెళతామని స్పష్టం చేశారు. మరోవైపు కోవిడ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా సమయంలో  డాక్టర్లు అత్యుత్తమమైన సేవలను అందిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా సేవలందిస్తూ అనేకమంది డాక్టర్లు చనిపోవడం కూడా జరిగింది. అలాంటి డాక్టర్ల డిమాండ్లను ఖచ్చితంగా పరిశీలించాలని రాష్ట్రవ్యాప్తంగా జూడాలు నిరసనలు చేపట్టారు. ప్రధానంగా నాలుగు డిమాండ్ చేస్తున్నామన్నారు. 1. ఇన్సూరెన్స్, ఎక్స్ గ్రేషియా కల్పించాలని, 2. కోవిడ్ ఇన్సెంటివ్, 3. ఆస్పత్రుల్లో భద్రత పెంచాలని, 4. టీడీఎస్ రద్దు చేయాలన్నారు. ఇప్పటికే తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని జూడాలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News