Friday, April 19, 2024

JNTU క్యాంపస్ లో ఫస్ట్ నైట్!

చదువుల తల్లి సరస్వతీ దేవి నిలయమైన విశ్వవిద్యాలయాన్ని అపవిత్రంగా మార్చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ JNTU యూనివర్శిటీని వేదికగా చేసుకున్నారు. విశ్వ విద్యాలయ గెస్ట్ హౌస్ ను ఓ ప్రొఫెసర్ హనీమూన్ సెంటర్ గా మార్చేశారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడలోని JNTU గెస్ట్ హౌస్ లో నవ దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు.

మొత్తం మూడు గదులు బుక్ చేయగా.. ఒక గదిలో శోభనం ఏర్పాటు చేశారు. మిగిలిన రెండు గదుల్లో పెళ్లి వేడుకలు జరిపినట్లు సమాచారం. వర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్ పేరుతో గదులు బుక్ చేశారు. ఆగస్టు 18న ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.స్వర్ణ కుమారి గెస్ట్ హౌస్ లో మూడు గదులను బుక్ చేసుకున్నారు. అందులో 201 గదిలో ఆగస్టు 18వ తేదీ రాత్రి నవ దంపతులకు అట్టహాసంగా శోభనానికి ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ప్రైవేటు కార్యక్రమాలు, ఇలాంటి వేడుకలకు యూనివర్శిటీలో అనుమతి ఇవ్వరు. అయితే, నిబంధనలకు అతిక్రమిస్తూ.. శోభనానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్ర సపరివార సమేతంగా హజరయ్యారు. నిబంధనలకు విరుధ్దంగా యూనివర్సిటీ యాజమాన్యం గెస్ట్‌హౌస్‌లో శోభనానికి అనుతివ్వటంతో ఇప్పుడు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రఖ్యాతిగాంచిన జె ఎన్ టి యు యూనివర్సిటీని అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించడం పట్ల పలు ఉద్యోగ,విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలో ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

ఈ వార్త కూడా చదవండిః ఏపీలో మరో అమానవీయ ఘటన.. రక్షించాల్సిన పోలీసే రక్షసుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement