Thursday, April 25, 2024

జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్.. తాడిప‌త్రిలో టెన్షన్

తాడిపత్రి టౌన్ (ప్రభ న్యూస్): అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెన్నా నది నుండి అక్రమంగా ఇసుకను తరలింపును అధికారులు ఆదివారంలోపు అరికట్టాలని లేకుంటే నేనే స్వయాన వాహనాలను అడ్డుకొని తగలబెడతానంటూ జేసి ప్రభాకర్ రెడ్డి గత వారం రోజుల క్రితం హెచ్చరికలు చేశారు. ఈ తరుణంలో సోమవారం డి.ఎస్.పి చైతన్య, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు, పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనకు నోటీసులు జారీ చేసి గుహనిర్బంధం చేశారు. ఎవరు కూడా అటువైపు వెళ్ళకుండా రహదారి పైన భారీ కేట్లు ఏర్పాటుచేసి రహదారిని దిగ్బంధం చేశారు. కార్యకర్తలను ఎక్కడివారిన అక్కడే అరెస్టు చేస్తూ పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త‌ వాతావరణం చోటుచేసుకుంది.

రోడ్డుపై బైఠాయించిన జేసీపిఆర్

జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో ఇంటినుండి బయట వచ్చి రోడ్డుపై జేసీ ప్రభాకర్ రెడ్డి బైఠాయించారు. ఈ సందర్భంగా జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపప్పూరు మండలంలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్ లో పరిమితుల మించి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరగాయని గతంలో కలెక్టర్, మైన్స్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని అంతేకాకుండా హైకోర్టులో కూడా పిటిషన్ వేశామ‌న్నారు. హైకోర్టు నుండి ఉత్తర్వులు వచ్చినా కూడా ఇక్కడ అధికారులు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని దీంతో తాను అక్రమంగా ఇసుక తరలించే వాహనాలను అడ్డుకొని టైర్లలోని గాలి తీయడంతో పాటు వాహనాలను తగలబెడతానని చెప్పాన‌న్నారు..అధికారులు వారి డ్యూటీ వారు చేస్తే నేనెందుకు అలా మాట్లాడతానని ఆయన అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని గృహనిబంధం చేసిన ఇంటి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించడంతో డీఎస్పీ, సిఐలు, ఎస్సైలు సిబ్బందితో కలిసి బలవంతంగా లాక్కు వెళ్లి ప్రయత్నం చేయగా జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై పడిపోయారు. దీంతో పోలీసులు ఎత్తుకెళ్లి గృహ నిర్బంధం చేశారు.

- Advertisement -

శాంతి భద్రత దృష్ట్యా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. డి.ఎస్.పి చైతన్య

జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దపప్పూరు మండలంలోని ఇసుకరీచ్ వద్దకు వెళ్లి అక్కడ ఇసుక తరలిస్తున్న వాహనాలను తగబెడతామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగిందని అక్కడికి వెళితే శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉండడంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని గృహ నిర్బంధం చేయడం జరిగిందని డిఎస్పి చైతన్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement