Thursday, April 25, 2024

ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత బాధితులకు జ‌న‌సేనాని అండ.. రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం

అమరావతి, ఆంధ్రప్రభ: మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయిన వారికి లక్ష రూపాయలు వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. మార్చి 14న ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభాస్థలిని ఇచ్చారని కక్షగట్టి శుక్రవారం జేసీబీలను పెట్టి, పోలీసులను మోహరింపచేసి ఇళ్ళు కూల్చిన ఘటన తెలిసిందే.

ఈ సంఘటన జరిగిన మరునాడే పవన్‌ కల్యాణ్‌ ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇళ్ళు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటంవాసుల గుండె నిబ్బరాన్ని చూసి చలించిపోయారు. బాధితులకు జనసేన అండగా ఉంటు-ందని హామీ ఇచ్చారు నైతిక మద్దతుతోపాటు- ఆర్ధికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ఇప్పుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ స్వయంగా అందజేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement