జమ్మలమడుగు ప్రతినిధి డిసెంబర్ 1 (ఆంధ్రప్రభ): జమ్మలమడుగు పట్టణంలోని ఐ సి టి సి ఏరియా హాస్పిటల్ జమ్మలమడుగు ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మరియు ప్రజలు కలిసి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఆదివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రఫిక్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్ర మండలి ప్రతి ఏడాది ఎయిడ్స్ పై ఒక ప్రచారం కోసం నినాదం ఎంచుకుంటుందని తెలిపారు. నా ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.
డిసెంబర్ ఒకటో తారీఖున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ నినాదం ఎంచుకోబడినది. లింకు ఎఆర్టి ద్వారా జమ్మలమడుగు గవర్నమెంట్ హాస్పిటల్ నందు హెచ్ఐవి పేషంట్లకు మందులు పూర్తి ఉచితంగా ఇవ్వబడతాయి అన్నారు ఎయిడ్స్ పై పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడుతాయి అన్నారు. ఈ విషయం ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఎవరికైనా ఎటువంటి లక్షణములు ఉన్న పట్టణంలో ఉన్న ఏరియా హాస్పిటల్ సంప్రదించి పూర్తి ఉచితముగా అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలన్నారు.
అనంతరం డాక్టర్ సుజాత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ప్రజలలో చైతన్యవంతం తీసుకురావాలని కోరారు. ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని అయితే అంటించుకునే వ్యాధి అని వివరించారు. అందువలన ప్రతి ఒక్కరు శుభ్రత పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఆ తదుపరి ఐ సి టి సి కౌన్సిలర్ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్ టీ.బీ అన్నవి రెండు మనిషి యొక్క శక్తి సామర్థ్యాలను తగ్గిస్తాయి కాబట్టి వీటిని దూరంగా ఉంచుకోవాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రక్త మార్పిడి అపరిశుభ్రత వలన, ఆ రక్షిత లైంగిక సంపర్కము ద్వారా వచ్చే వ్యాధి కాబట్టి, ప్రతి ఒక్కరూ హెచ్ఐవి టెస్ట్ చేపించుకోవాల్సిందిగా కోరడమైనది.
ముఖ్యంగా గర్భవతులు వారి భర్తలు తప్పనిసరిగా హెచ్ఐవి టెస్ట్ పరీక్షలు చేపించుకోవాలి. దీనివలన పుట్టపోయే బిడ్డకు హెచ్ఐ నుండి రక్షణ పొందేందుకు అవకాశం ఉంటుంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ రామచంద్ర మరియుటిబి సూపర్వైజర్ మునిస్వామి, రవిశంకర్, ఆర్గనైజర్స్ బాలు, భారతి, శోభ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు