Saturday, November 27, 2021

ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ కు సీఎం అభినందన

ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎన్నికైన ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ బాధ్యతలు స్పీకరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ జకియా ఖానమ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… అధ్యక్షా అని సంభోదించే స్ధానంలో నా అక్క జకియా ఖానమ్‌ అమ్మ కూర్చోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక గృహిణిగా చట్టసభల్లో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ  చైర్మన్‌గా ఈ రోజు ఆ స్ధానంలో కూర్చున్నారని కొనియాడారు. నిజంగా మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం, ఒక సందేశం అని చెప్పారు. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలన్న సీఎం… ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్నారు. ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలి అన్న మన ప్రయత్నం ఈ రెండున్నర సంత్సరాలుగా జరుగుతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News