Thursday, December 12, 2024

AP | జగన్‌ పెన్ను, పేపర్ల ఖర్చు రూ.9.84 కోట్లు… మండిపడ్డ మంత్రి లోకేష్

అమరావతి, ఆంధ్రప్రభ : తాడేపల్లి ప్యాలెస్‌ లో విధ్వంసపు ప్లాన్‌లు గీసేందుకు పెన్నులు, పేపర్ల పేరుతో మాజీ సీఎం జగన్‌ రూ.9 కోట్ల 84 లక్షలకు పైగానే ప్రజాధనం మింగారని మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.శుక్రవారం తన ఎక్స్‌ ఖాతా లో మంత్రి లోకేష్‌ వెల్లడించారు.

తన తాడేపల్లి ప్యాలెస్‌ ఇనుప కంచెకు రూ.12.85 కోట్లు, ఎగ్‌ పఫ్‌లకు కోట్లాది రూపాయలు వెచ్చించిన జగన్‌ ధనదాహానికి అంతులేకుండా పోయిందని మంత్రి లోకేష్‌ మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ లో విధ్వంస రచనకు ఇంత ఖర్చా అని తన పోస్ట్‌ లో ప్రశ్నించారు. జగన్‌ జేబులోది అంతా ప్రజా ధనమే అని మంత్రి లోకేష్‌ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement