ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. కాసేపటి క్రితం సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానంలో టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం ఏర్పడింది. తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. అయితే సీఎం జగన్ గన్నవరం నుంచి తిరిగి తాడేపల్లికి వెళ్లిపోయారు.
- Advertisement -