Thursday, March 28, 2024

వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌.. పీఆర్సీపై ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం..

వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు సీఎం జగన్ పర్యటిస్తున్నారు. నిన్న కడప జిల్లాలో పర్యటించారు. అక్కడి నుండి నేరుగా ఆయన చిత్తూరు జిల్లా టూర్ కు వచ్చారు. ఇవాళ తిరుపతిలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. నిన్ననే చిత్తూరు జిల్లా టూర్ కు వచ్చారు. రాత్రి తిరుపతిలోని సీఎం జగన్ బస చేశారు. ఇవాళ ఉదయం తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్ లో వరద భావిత ప్రాంతాల్లో పర్యటించారు. గ‌త నెల‌లో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలను భారీ వ‌ర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాలతో భారీగా నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులు తెగిపోయాయి. చెయ్యేరు వరద ప్రభావంతో సుమారు 30 మంది గల్లంతయ్యారు. వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించింది. మరో వైపు నిత్యావసర సరుకులను కూడా అందించింది.

తిరుపతి పట్టణంలోని శ్రీకృష్ణానగర్ లో వరద బాధితులను పరామర్శించారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంద‌ని ఆయన హామీ ఇచ్చారు. వరద నష్టాలపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని చూశారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో సీఎం జగన్ నేరుగా మాట్లాడారు. వరదలతో చోటు చేసుకొన్న నష్టం వివరాలను బాాధితులను అడిగి తెలుసుకొన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. సరస్వతీ నగర్‌లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిసి పీఆర్సీపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, పదిరోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం జగన్‌ అన్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.

వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తాయి. ప్రధానంగా మూడు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. బ్రిడ్జిలు, కాజ్ వేలు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారులు కోతకు గురయ్యాయి. రైల్వేట్రాక్ లు దెబ్బతిన్నాయి. జన జీవనం స్థంభించింది. వరదలకు గ్రామాలకు గ్రామాలే నీటిలోనే ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం వివరాలను జగన్ అడిగి తెలుసుకొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement