Tuesday, April 23, 2024

తప్పుడు కేసులతో జగన్ రెడ్డి టీడీపీని అడ్డుకోలేడు : నారా లోకేష్

త‌ప్పుడు కేసుల‌తో జ‌గ‌న్ రెడ్డి టీడీపీని అడ్డుకోలేడ‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా లోకేష్ అన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై సోమ‌వారం విజయవాడలోని మెట్రో పాలిటన్ కోర్టుకు హాజరయ్యారు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. “ఈ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నాపై 14 తప్పుడు కేసులు పెట్టించాడు. హత్యాయత్నం కేసు కూడా పెట్టించాడు….పెట్టించి ఏం పీకాడు ? ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టించాడు. తరువాత దళితులు, మైనారిటీలు, బీసీలపై తప్పుడు కేసులు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో పోలీస్ రాజ్ నడుస్తోంది. రాష్ట్ర ప్రజలే భయంతో బతుకుతున్నారు. వారు ఏం మాట్లాడినా వాలంటీర్లతో బెదిరిస్తున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సినిమా ఇప్పటికే మూడేళ్లు పూర్తయింది. ఇంకో సంవత్సరంలో ఇంటి కెళ్లి పడుకుంటాడు. తెలుగుదేశం పార్టీని కేసులతో అడ్డుకోలేరు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే న్యాయస్థానాలకు హజరవుతున్నాను.. జరిగిన వాస్తవాలను వివరిస్తున్నా.. జగన్ రెడ్డి తప్పులు చేస్తున్నాడు కాబట్టే కోర్టులకు ముఖం చూపించడం లేదు. తను దేశం దాటి వెళ్లాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాలి. తప్పుచేయడం అనేది తెలుగుదేశం పార్టీ రక్తంలోనే లేదు. మేము తప్పుచేయం.. తప్పుచేసిన వారిని వదిలిపెట్టం. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులంతా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాన‌న్నారు. ఎక్కడా వెనక్కు తగ్గేదేలేదు.. మమ్మల్ని నమ్ముకున్నపార్టీకి, ప్రజలకు అండగా నిలబడే తీరుతాం. దమ్ము, ధైర్యం ఉంటే 2019నుంచి ఇప్పటి వరకు నాపై పెట్టినతప్పుడు కేసులపై జ‌గ‌న్ రెడ్డి బహిరంగ చర్చకు రాగలడా ? హంత‌కుడైన మీ ఎమ్మెల్సీ మీపార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కలిశాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యపై సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకువస్తాయి. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement