Friday, October 4, 2024

AP: మ‌రోసారి మోసం చేయాలని జగన్ చూస్తున్నారు… బైరెడ్డి

నంద్యాల : మరోమారు మోసం చేయాల‌ని జ‌గ‌న్ చూస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా ఓల్డ్ కల్లూరు శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్బంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ చేసి, ఆలయ పవిత్రతను దెబ్బతీసి, వెంకన్న భక్తుల ఆగ్రహానికి గురైన జగన్, ఆయన గ్యాంగ్ మళ్ళీ సమస్యను పక్కదోవ పట్టించాల‌ని చూస్తున్నార‌న్నారు. రాయలసీమలోని గ్రామాల్లో ఎవరైనా తప్పుచేస్తే చేసిన తప్పుకు గ్రామ ప్రజల సమక్షంలో సుంకులమ్మ కొరడా (సెలకాల) తో గ్రామ రచ్చబండ వద్ద కొట్టుకునే సంప్రదాయమ‌ని, వైఎస్ జగన్ కూడా సుంకులమ్మ కోర‌డాతో బట్టలు ఇప్పి కొట్టుకున్నా తిరుమలలో చేసిన పాపం పోదని బైరెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు లక్ష్మిరెడ్డి, వేముల శ్రీధర్, బీజేపీ నాయకులు నాగరాజు, తదితరులు పచ్చాతాప పూజల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement