Monday, April 15, 2024

జి-20 సదస్సులో జగన్ – 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని వెల్లడి

విశాఖలో మీరు గడిపిన సమయం మీకు మధురానుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నానని సీఎం జగన్ అన్నారు. విశాఖ లో నేడు ప్రారంభమైన జి-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ,. ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది తమ ఉద్ధేశ్యమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. 22 లక్షల ఇళ్లు కడుతున్నామని అన్నారు.ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. దీనిపై సరైన చర్చలు జరిపి సస్టెయిన్‌బుల్‌ పద్ధతులను సూచించాలని కోరుతున్నానని సీఎం అన్నారు. దీనిపై సరైన మార్గనిర్దేశకత్వం అవసరమని అన్నారు. దీనివల్ల మంచి ఇళ్లు పేదలకు సమకూరుతాయని అభిప్రాయపడ్డారు దీనిపై మీ నుంచి మంచి ఆలోచనలు కావాలని అన్నారు. సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలని సీఎం జగన్ తెలిపారు. ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేయాలని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement