Saturday, October 12, 2024

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ ఓకే

అమరావతి – గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారుజిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించగా..అంతర్ జిల్లాల బదిలీల్లో స్పాస్, మ్యూచువల్ బదిలీలకు వీలు కల్పించారు. ఇక జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే రెండేళ్లు పూర్తి అయ్యి ప్రొబేషన్ డిక్లేరైన వాళ్లు బదిలీలకు అర్హులవుతారు. ఈ బదిలీల్లో ఎలాంటి పైరవీలకు తావులేకుండా జరుగుతాయని స్పష్టం చేసింది. బదిలీల ప్రక్రియను ప్రారంభించి వెంటనే చేపట్టాలని సీఎం ఆఫీస్ నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement