Saturday, April 20, 2024

అయిదు ల‌క్ష‌ల ఇళ్లు అనుమాన‌మే..

అమరావతి, ఆంధ్రప్రభ: పేదలకు ఉచిత ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా ఈ ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ట్లు పనుల్లో వేగం పెంచింది. ఎక్కడిక్కడ ఇసుక,ఇనుము, సిమెంట్‌ అందుబాటులో ఉంచింది. ఈ మేటీరియల్‌ నిత్యం అందుబాటులో ఉండేందుకు గోదాములను కూడా నిర్మించింది. వివిధ చోట్ల ఇళ్ల నిర్మాణాలపై ఉన్న కోర్టు కేసులను కూడా పరిష్కరించుకుంది. కోర్టు కేసుల్లో ఇరక్కపోయిన స్టలాలను కొన్ని చోట్ల ప్రత్యామ్నయ స్థలాలను చూపించి ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. ఎప్పటికప్పడు నిర్మాణ బిల్లులలను కూడా చెల్లిస్తోంది. ఇంత చేసినప్పటికీ ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లను నిర్మించడం అనుమానంగానే ఉంది. ఇప్పటికి రెండు లక్షల 85 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారు. ఉగాదికి మరో 25 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎంచుకున్న టార్గెట్‌లో ఇప్పటికి 57శాతం మాత్రమే నేరవేర్చారు. మరో 25 రోజుల్లో 43 శాతం ఇళ్లు పూర్తవ్వడం కష్టమనే చెప్పాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ఏడాది వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న గృహ నిర్మాణ శాఖ ప్రస్తుతం మాత్రం మిషన్‌ మోడ్‌లో పని చేస్తోంది. రోజుకు రెండు వేల ఇళ్లను పూర్తి చేస్తోంది. అయినప్పటికీ పెట్టుకున్న టార్గెట్‌ భారీగా ఉండడంతో లక్ష్యానికి చేరువవ్వడం కష్ఠంగానే ఉంది. గత నెల రెండో తేదీ నాటికి 2,11,310 ఇళ్లు పూర్తవ్వగా ఇప్పటికి 2 ల క్షల 90 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అంటే 53 రోజుల్లో 75 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నా లబ్దిదారులకు బ్యాంక్‌ లింకేజ్‌లో ఆలస్యమవ్వడం, లబ్దిదారుడు తన స్వంత జేబు నుండి పెట్టుకునే డబ్బును పెట్టుకోలేపోవడం వల్ల కొన్ని ఇళ్ల నిర్మాణ ం ఆలస్యమౌతోంది.


మూడున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికే పరిమితం
ప్రస్తుతం రోజుకు రెండు వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఉగాదికి మరో 25 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ లెక్కన చూసుకున్న మరో 50 వేల ఇళ్లకు మించి పూర్తయ్యే అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తే లక్ష్యంగా పెట్టుుకున్న ఇళ్లలో మరో 70 వేల ఇళ్లు రూఫ్‌ కనస్ట్రక్షన్‌ లెవల్లో ఉన్నాయి. ఈ ఇళ్లకు రూఫ్‌ను వేసి ఆ తర్వాత తలుపులు, కిటీకీలు బిగించే సరికే ఉగాది వస్తుంది. కాబట్టి ఎంత స్పీడ్‌గ చేసినా ఈ 70 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యే అవకాశముంది. మరో 76 వేల ఇళ్లు రూఫ్‌ లెవల్‌ వరకు వచ్చి ఉన్నాయి. ఇవి ఉగాది నాటికి పూర్తవ్వడం కష్టమే. మొత్తంగా చూస్తే మూడున్నర లక్షల వరకు ఇళ్లు పూర్తయ్యే అవకాశముంది. అయితే బహుబలి టార్గెట్‌ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ల క్ష్యాన్ని సాధించడం కూడా పెద్ద విషయమే. ఏడాదిలోగా మూడున్నర లక్షల ఇళ్ల నిర్మాణం దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని గృహ నిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement