Saturday, April 20, 2024

క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు.. దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి, ఆంధ్రప్రభ: జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద క్లస్టర్‌ డెవలప్మెంట్‌ ప్రోగ్రాంలో టెస్ట్‌ టైల్‌ డిజైనర్‌ 7 ఖాళీలు, క్లస్టర్‌ డెవలప్‌ మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ 7 ఖాళీలులో పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా – చేనేత జౌళి శాఖ కమిషనర్‌ ఎమ్‌ ఎమ్‌. నాయక్‌ సూచించారు. బనగాన పల్లె (నంద్యా), మురమండ, పూలగుర్త (తూర్పు గోదావరి), పాలకొండ, నారాయణపురం (పార్వతీపురం మన్యం), బొబ్బిలి (విజయనగరం), పాయకరావుపేట (అనకాపల్లె) లలో నియామకాలు జరుగుతాయని తెలిపారు. క్లస్టర్‌ డెవలప్‌ మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ నకు హ్యాండ్‌ లూమ్‌ టెక్నాలజీ నందు డిప్లొమా కలిగి 2 సంవత్సరాలు అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి రికార్డు ల నిర్వహణ వహించవలసి ఉంటుందన్నారు. టెస్ట్‌ టైల్‌ డిజైనర్‌ పోస్ట్‌ నకు టెస్ట్‌ టైల్‌ డిజైన్‌ ఇనిస్టిట్యూట్‌ నుండి ఉత్తీర్ణులై ఉండి, 2 సంవత్సరాల అనుభవం కలిగి చేనేత రంగంలో డిజైన్స్‌ ఉత్పత్తుల యొక్క ఉన్నతి మరియు అభివృద్ధిలో అనుభవం కలిగి ఉండాలన్నారు.

ఏదైనా కంపెనీ లేదా ఏజెన్సీ డిజైనర్‌ ను సిఫార్స్‌ చేస్తున్నట్లయితే టెస్ట్‌ టైల్‌ డిజైనర్‌ యొక్క బయో డేటా తో పాటు కంపెనీ, ఏజెన్సీ వివరాలు సమర్పించాల్సిందిగా సూచించారు. నియామకాలు అర్హత, అనుభవం, వయస్సు, నివాసం ఆధారంగా జరుగుతాయన్నారు. దరఖాస్తుదారుడు ధ్రువపత్రాల కాపీలతో పాటు బయో డేటా ను సమర్పించాలన్నారు. నియామకాలు తాత్కాలిక ప్రాతిపదికన ఉండి 3 సంవత్సరాల వరకూ నెలకు 30 వేల రూపాయలు కన్సాలి డేటెడ్‌ పారితోషికం ఉంటు-ందని తెలిపారు. పై పోస్టులకు తమ సేవలను అందించడానికి ఆసక్తి ఉన్న అర్హత గల అభ్యర్థులు ఈనెల 31వ తేదీ లోగా కమిషనర్‌, చేనేత మరియు జౌళి శాఖ, 4వ అంతస్తు, ఒఐఈ కార్పొరేట్‌ బిల్డింగ్‌, ఆటోనగర్‌, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌, పిన్‌ కోడ్‌ 522523 నకు దరఖాస్తులను సమర్పించవలెనని నాయక్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement