Thursday, November 14, 2024

Indrakeeladri – మ‌హాచండీదేవి అలంకారంలో దుర్గ‌మ్మ అనుగ్ర‌హం…

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.

దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారడంతో పాటు ఏ కోరికలతో ప్రార్థిస్తామో అవన్నీ సత్వరమే లభిస్తాయనేది భక్తజనుల నమ్మకం. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement