Saturday, April 20, 2024

క‌రోనాపై స‌’సైన్యం’గా యుద్ధం….

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక నేటి ప్ర‌త్యేక క‌థ‌నం…
దేశంలో ప్రమాదకరంగా కరోనా రెండో తరంగం
ఆక్సిజన్‌ అందకే అత్యధిక మరణాలు
దేశంలో తగినంతగా మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి
కానీ ఇతర ప్రాంతాలకు తరలించడమే సవాల్‌
రవాణా, యంత్రాంగం, సమయం చాలకపోవడమే సమస్య
ఈ సమయంలో సైన్యం సేవలు అత్యవసరం
సంసిద్ధత వ్యక్తం చేసిన త్రివిధ దళాలు

న్యూఢిల్లీ – ప‌త్రేక ప్ర‌తినిధి – దేశం కోవిడ్‌ రెండో తరంగంతో చేస్తున్న పోరాటంలో భారత సైనిక దళాలు కూడా భాగస్వామ్యమౌతున్నాయి. సైనిక దళాలకు చెందిన వైద్యులందరికీ సెలవుల్ని రద్దు చేశారు. అలాగే పదవీ విరమణను డిసెంబర్‌ 31వరకు పొడిగించారు. అందుబాటులో ఉన్న వైద్యులందర్నీ కోవిడ్‌ సేవలకు మళ్ళించారు. ఇప్పటికే సైన్యం అధీనంలో ఆక్సి జన్‌ పడకల్తో కూడిన ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోంది. గతనెల 19న 1821ఆక్సిజన్‌ పడకల్తో ప్రారంభించిన ఈ ప్రక్రియ నెలాఖరకు 4,220పడకలకు పెరిగింది. దీన్ని కనీసం 25వేల పడకలకు పెంచే దిశగా సైనిక దళాలు పని చేస్తున్నాయి. ఢిల్లిలోని విమానాశ్రయ సమీపంలో ఐదొందల ఆక్సిజన్‌ పడకల్తో సాయుధ దళాలు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆర్మీకి చెందిన 122మంది వైద్యాధికారులు, 48మంది నర్సింగ్‌, 120మంది పారా మెడికల్‌ సిబ్బం ది పని చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో ధన్వంతరి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను సైనిక దళాలు ప్రారంభించాయి. అలాగే బీహార్‌లోని పాట్నాలో మరో ఆసుపత్రిని నెల కొల్పాయి. అహ్మదాబాద్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదొందల పడకలుంటే దీన్ని తొమ్మిదొందల గపడ కలకు పెంచుతున్నారు. అలాగే లక్నో, వారణాశిల్లో కూడా చెరో వెయ్యి పడకల ఆసుపత్రుల ఏర్పాటుకు సైన్యం శ్రీకారం చుట్టింది. లక్నో ఆసుపత్రికిప్పటికే 133మంది వైద్యుల్ని, 69మంది పారామెడికల్‌ సిబ్బందిని నియమించింది. వారణాశి ఆసుపత్రికి 145మంది వైద్‌ుల్ని, 64మంది పారామెడికల్‌ సిబ్బం దిని పంపింది. ఈ ఆసుపత్రున్నింటిని డిఆర్‌డిఓ నిర్మి ంచి నిర్వహిస్తోంది. మెడికల్‌ కార్ప్స్‌యొక్క ప్రాధమిక లక్ష్యం శాంతి మరియు యుద్ద సమయాల్లో శక్తి సంరక్షణను నిర్ధారించడం. ప్రస్తుత పరిస్థితి వీరి కొక హెచ్చరికలాంటిది. సైనికులు, అనుభవజ్ఞులు కేవ లం కుటుంబాలకే పరిమితం కారు. ఇటువంటి విప త్కా లంలో పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు తమ వం తు కృషి చేయడం భారత సైనిక దళాలకు ఇచ్చే తర్పీ éదులో ఓ భాగంగా ఓ మిలటరీ అధికారి పేర్కొన్నారు.
దేశంలోని పలు రంగాలు ఇప్పుడు కోవిడ్‌ సేవలకు సమాయత్తమౌతున్నాయి. వీటన్నింటి కంటే ఎక్కువ బలం, బలగం, శక్తిసామర్ద్యాలు, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వ్యవస్థ భారతీయ రక్షకదళం. సైన్యం, వాయుసేన, నావికాదళాలు కూడా ప్రత్యే కంగా వైద్య విభాగాల్ని కలిగున్నాయి. ఇందులో తర్ఫీ దు పొందిన వేలాదిమంది వైద్య నిపుణులున్నారు. వీరికి సహాయంగా పారా వైద్య సిబ్బంది పని చేస్తు న్నారు. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది. వైద్య రంగంలోనూ అందుబాటులోకొచ్చిన సాంకేతిక వ్యవస్థను ఇది అభివృద్ది పర్చుకుంటోంది. కరోనాపై దేశం చేస్తున్న పోరాటంలో భారత సైన్యం తమవంతు పాత్రను నిర్వహించేందుకు ముందుకు రావడం ముదావహం.
అమెరికా ప్రభుత్వం కోవిడ్‌ చేస్తున్న యుద్దంలో అక్కడి సైన్యం కూడా పాలుపంచుకొంది. వ్యవస్థల్ని కట్టడి చేయడంలో బాధ్యత తీసుకుంది. అలాగే నిత్యావసరాలు, మందులు, ఆక్సిజన్‌ల సరఫరా వ్యవస్థను సమర్ధవంతంగా ముందుకు నడిపించింది. భారత్‌లో కూడా సైన్యం తమ సేవల్ని అందిస్తా మంటూ తొలి తరంగ సమయంలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే అప్పట్లో అంతటి అవసరం రాలేదు. కాగా రెండో తరంగం ప్రారంభమౌతున్న దశలోనే మరోసారి సైన్యం ప్రభుత్వాన్ని ఈ మేరకు అభ్యర్ధించింది.
సైనిక సేవల్ని మరింత విస్తృతంగా వినియో గించుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన ఆక్సిజన్‌ కొరతుంది. అయితే భారత్‌లో ఆక్సిజన్‌ ఉత్పత్తికి ఢోకా లేదు. ప్రస్తుత అవసరాల కంటే అదనంగానే ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఈ ఉత్పత్తంతా మారుమూల ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో సాగుతోంది. వాస్త వానికిదంతా పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే ఆక్సిజన్‌. దీన్ని కొద్దిపాటి మార్పుల్తో వైద్య ఆక్సిజన్‌గా మారుస్తున్నారు. దీన్నే నగరాలు, పట్టణాల్లోని ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు ఆక్సిజన్‌ సరఫ రాకు అనేక అవాంతరాలు ఎదురౌతున్నాయి. మార్గమధ్యంలో ఆక్సిజన్‌ ట్యాం కర్లపై దాడులు జరుగుతున్నాయి. పోలీస్‌ పహరాతో ఈ ట్యాంకర్లను నడిపించాల్సొస్తోంది. అన్నింటికి మించి ఉత్పాధక ప్రాంతం నుంచి ఆసుపత్రులకు వందల కిలోమీటర్ల దూరం పొడవునా ఆక్సిజన్‌ రోడ్‌ లేదా రైలు మార్గంలో తరలించాల్సిన పరిస్థితేర్ప డింది. దీంతో ఆక్సిజన్‌ సకాలంలో అందక వందల సంఖ్యలో రోగులు రోజూ చనిపోతున్నారు. ప్రస్తుత కోవిడ్‌ రెండో తరంగంలో ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో 80శాతం మందికిపైగా ఆక్సిజన్‌ అవసరాన్ని కలిగుంటున్నారు. దీంతో తగినంత ఆక్సిజన్‌ సకాలంలో వారికందడంలేదు. ఆసుపత్రులపై ఆక్సి జన్‌ ఒత్తిడి పెరుగుతోంది. ఈ దశలో భారత సైన్యం బరిలో దిగాలి. నేరుగా ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతున్న ప్రాంతాల్లోనే తాత్కాలిక ఆసుపత్రుల్ని నిర్మించాలి. పట్టణాలు, నగరాల్లో కాకుండా పరిశ్రమల పక్కనే వీటి నేర్పాటు చేయాలి. ఇందుకు తగ్గ మౌలిక సదు పాయాలు, సరంజామా సైన్యానికి అందుబాటులో ఉంటాయి. వారివద్ద పెద్ద పెద్ద శక్తివంతమైన టెంట్లు, మంచాలు, పరుపులు, నిత్యం అందుబాటులో ఉంటాయి. ఎక్కడికెళ్ళినా వారికివారే గుడారా లేర్పాటు చేసుకుంటారు. వందల సంఖ్యలో సైనికులు బస ఏర్పాట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేస్తారు. అదే రీతిలో ఆక్సిజన్‌ ఉత్పాధక పరిశ్రమల పక్కనే కోవిడ్‌ కేర్‌ కేంద్రాల్ని నెలకొల్పాలి. అక్కడ మంచాలేసి ఆక్సిజన్‌ అవసరమున్న రోగుల్ని అంబులెన్స్‌ల్లో అక్కడికి తరలించాలి. పక్కనే తయారౌతున్న ఆక్సిజన్‌ పరిశ్రమ నుంచి గొట్టాల ద్వారా నేరుగా వీరికి ఆక్సిజన్‌ సరఫరా చేసే పరికరాల్ని ఏర్పాటు చేయాలి. వీటి నిర్వహణకవసరమైన వైద్యులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది సైన్యం వద్ద అందుబాటులో ఉన్నారు. దీంతో రాష్ట్రాలు రాష్ట్రాలు దాటి ఆక్సిజన్‌ను రోడ్డు, రైలు మార్గాల్లో తరలించాల్సిన దుస్థితి తప్పుతుంది. ఈ మధ్యకాలంలో తీవ్ర సమయాభావం జరుగుతోంది. మార్గమధ్యంలో పలు అవాంతరాలు ఎదురౌ తు న్నాయి. వీటన్నింటిని అదిగమించి రోగులకు అవస రానికనుగుణంగా వెనువెంటనే ఆక్సిజన్‌ అందించే వెసులుబాటు ఈ తాత్కాలిక కోవిడ్‌ కేంద్రాల్లో ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement