Tuesday, March 26, 2024

AP | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ఆర్టీసీ డ్రైవర్‌ను చిత‌క‌బాదిన ప్ర‌యాణికులు

సత్యవేడు (ప్రభ న్యూస్): బస్సులో వచ్చే బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు గురిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌కు ప్రయాణికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్ప‌గించారు. ఈ ఘ‌టన తిరుప‌తి జిల్లాలో జ‌రిగింది. శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులుకు (46 ) రోజూ స్కూల్ కు వెళ్ల‌డానికి బస్సు ఎక్కే బాలికలతో అసభ్యకరంగా వ్యవహారించడం అలవాటుగా మారింది.

అంతే కాక .. చదువుకునే బాలికలను సెల్ ఫోన్ లో ఫొటోలు తీసుకుని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇవ్వాల (శ‌నివారం) గమనించిన ప్రయాణికులు కొంత‌మంది డ్రైవర్ ను నీలదీశారు. అంత‌టితో ఆగ‌కుండా చిత‌క‌బాదారు. ఆ త‌ర్వాత బీ ఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు‌. నిందితుడిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌ట్టిన‌ట్ట ఎస్ఐ మంజునాథ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement